హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి
NEWS Dec 02,2024 03:15 am
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు హనుమంత వాహనంపై దర్శనం ఇచ్చారు. శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈనెల 6వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ.