మున్సిపల్ చైర్మెన్ పర్యటన
NEWS Dec 01,2024 12:19 pm
నిర్మల్ పట్టణంలోని వార్డు నెం 14 విద్యానగర్ కాలనీలో నెలకొన్న సమస్యల దృష్ట్యా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ ఆదివారం పర్యటించారు. శానిటేషన్ పరంగా ఖాళీ ఫ్లాట్స్ లో, డ్రైనేజీ వెంబడి, పిచ్చి మొక్కలు గుబురుగా పెరగటం,రోడ్డు - డ్రైనేజీ సమస్యలు వంటివి చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ అంతటా తిరుగుతూ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం డ్రైనేజీ, పిచ్చి మొక్కలు వంటివి శుభ్రం చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.