సంక్రాంతికి రైతు భరోసా
NEWS Dec 01,2024 11:46 am
సంక్రాంతి పండుగకు రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై రెచ్చి పోయారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్ తమకు అప్పగించారని ఆరోపించారు. 10 ఏళ్ల కాలంలో ఏకంగా రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేశారని, వాటికి నెల నెలా అసలు, వడ్డీలు కట్టలేక పోతున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ. 16,000 కోట్లు మిగులు బడ్జెట్ తో ఉండేదన్నారు. కేసీఆర్ వచ్చాక నాశనం చేశాడని ఆరోపించారు.