పాఠశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణ
NEWS Dec 01,2024 12:18 pm
నేటి నుంచి ఈ నెల 9 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కేజీబీవి కడెం, లక్ష్మణచందా మండలంలోని వడ్యాల్ జెడ్పిహెచ్ఎస్, మామడ జెడ్పిహెచ్ఎస్, కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ టిఎస్ డబ్ల్యూఆర్ఎస్, ముధోల్, తానూర్ ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించారు.