మరాఠాలో రాష్ట్రపతి పాలన విధించాలి
NEWS Dec 01,2024 11:25 am
శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.