అంబేద్కర్ సంఘం నాయకుల సమావేశం
NEWS Dec 01,2024 12:10 pm
మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ ఆఫీస్ వద్ద ఆదివారం మండల అంబేద్కర్ సంఘం నాయకులు సమావేశమాయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 15న అంబేద్కర్ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 6న జరగబోయే అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.