Logo
Download our app
స‌న్నీ లియోన్ ఈవెంట్ ర‌ద్దు
NEWS   Dec 01,2024 09:56 am
హైద‌రాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు న‌టి స‌న్నీ లియోన్ కు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబ‌ర్ 10 లోని ఇల్యూజ‌న్ ప‌బ్ లో నిర్వ‌హించ‌ద‌ల్చిన డీజే ఈవెంట్ కు అనుమ‌తి ఇవ్వ‌డం లేదంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో స‌న్నీ లియోన్ షోను ఎంజాయ్ చేద్దామ‌ని అనుకున్న ఫ్యాన్స్ కు షాక్ త‌గిలింది. రాత్రి 11 నుండి 12.30 వ‌ర‌కు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. బుక్ మై షో ద్వారా 500 టికెట్లు అమ్మేశారు. కానీ ఈవెంట్ ర‌ద్దుతో నిరాశ‌కు గుర‌య్యారు.
⚠️ You are not allowed to copy content or view source