Logo
Download our app
అంజన్న దర్శించుకున్న హీరో శ్రీకాంత్
NEWS   Dec 01,2024 12:10 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని సినీ హీరో శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయనకు, ఆలయ అర్చకులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. కొండగట్టు అంజన్న చాలా మహిమగల దేవుడని, దర్శనానికి తరచూ వస్తుంటానని, ఇక్కడికి రావడం ఇది మూడోసారి అని తెలిపారు. ఆయన వెంట బుల్లితెర నటులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source