శ్రీశైలంలో ఘనంగా కార్తీకమాసం
NEWS Dec 01,2024 08:40 am
శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో నిండి పోయింది. చివరి రోజు కావడంతో కార్తీక మాసోత్సవాలకు పోటెత్తారు స్వామి, అమ్మ వార్లకు ఇవాళ పూజలు చేస్తే కోరిన కోర్కెలు ఫలిస్తాయని నమ్మకం. శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేసేందుకు పోటీ పడ్డారు భక్తులు. కార్తీక మాసం ముగింపు కావడంతో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది శ్రీశైలం దేవస్థాన కమిటీ.