కల్పవృక్ష వాహనంపై సిరుల తల్లి
NEWS Dec 01,2024 08:24 am
శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మ వారు కల్పవృక్ష వాహనంపై ఊరేగారు. శ్రీ రాజ గోపాల స్వామి వారి అలంకారంలో చంద్రోకలు, దండం ధరించి శ్రీ పద్మావతి అమ్మ వారు భక్తులకు అభయం ఇచ్చారు. గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో అమ్మ వారిని కీర్తించారు. చిరు జల్లుల మధ్య వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.