ఎయిడ్స్ దినోత్సవ కరపత్రాలు ఆవిష్కరణ
NEWS Dec 01,2024 07:19 am
మల్లాపూర్: డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని మల్లాపూర్ మండల కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సెక్స్ సైకాలజిస్ట్ రాజా రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. వ్యాధి వ్యాపించే విధానాలను వివరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రవీందర్, సత్యనారాయణ, రాజేందర్, రాంప్రసాద్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.