గ్యాస్ సిలిండర్ ధర పెంపు
NEWS Dec 01,2024 05:52 am
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తక్షణమే అమలులోకి వచ్చేలా వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ కొత్త రిటైల్ ధర రూ.1,818.50. అదనంగా, 5-కేజీల ఫ్రీ ట్రేడ్ LPG సిలిండర్ల ధర కూడా రూ.4 పెరిగింది. కాగా 14.2-కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల ధర పెంచలేదు.