ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్
NEWS Dec 01,2024 05:01 am
మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఘటన ఏటూరునాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రే హౌండ్స్ , మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో బద్రు, మధు, కరుణాకర్, జైసింగ్ , కిషోర్, కామేష్ , జమున మృతి చెందారని సమాచారం. ఈ ఘటనపై ఇంకా పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.