Logo
Download our app
స‌ర్వ ద‌ర్శ‌నానికి 12 గంట‌లు
NEWS   Dec 01,2024 04:40 am
తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 73,619 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ప్ర‌స్తుతం 4 కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. శ్రీ‌వారి స‌ర్వ ద‌ర్శ‌నానికి 12 గంట‌ల‌కు పైగ స‌మ‌యం ప‌డుతుంద‌ని ఈవో వెల్ల‌డించారు. హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. మ‌రో వైపు తుపాను కార‌ణంగా భారీ ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source