తిరుమలలో శ్రీవారి మెట్లు మూసివేత
NEWS Dec 01,2024 04:29 am
తుఫాను ప్రభావంతో ఏపీ అంతటా కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసి వేసింది టీటీడీ. నిండిన గోగర్భం జలాశయం, 3 సెం.మీ. మేర గేట్లు ఎత్తివేసినట్లు వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.