టీటీడీ స్విమ్స్ కి రూ. 50 లక్షల విరాళం
NEWS Dec 01,2024 02:47 am
ముంబైకి చెందిన జీన్ అండ్ బోమని ఎ. దుబాషీ ఛారిటీ ట్రస్ట్ భారీ విరాళం అందజేసింది టీటీడీకి. తిరుమలలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని స్కీమ్ (స్విమ్స్ )కి రూ. 50 లక్షల చెక్కును టీటీడీ ఈవో జె. శ్యామలరావుకు ట్రస్టు ప్రతినిధి చంద్రశేఖర్ అందజేశారు. గతంలో ఈ ట్రస్టు వివిధ సందర్భాలలో స్విమ్స్ కు రూ. 7 కోట్లను అందజేసిందని తెలిపారు ఈవో. లక్షలాది మంది భక్తులకు ఆరోగ్య పరంగా విశిష్ట సేవలు అందజేస్తోంది టీటీడీ.