సింహ వాహనంపై పద్మావతి దర్శనం
NEWS Dec 01,2024 02:42 am
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. తుఫాన్ నేపథ్యంలో వాహన మండపంలో భక్తులు సేవించుకున్నారు. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.