వర్షాల దెబ్బకు చెన్నై విలవిల
NEWS Dec 01,2024 02:26 am
ఫెయింజిల్ తుఫాను తాకిడికి తమిళనాడు విల విల లాడుతోంది. చెన్నై అంతటా వర్షంలో చిక్కుకు పోయింది. ప్రభుత్వం సహాయక చర్యలలో నిమగ్నమైంది. సీఎం ఎంకే స్టాలిన్ సమీక్షిస్తున్నారు. నగరంలో 134 ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురు గాలుల తాకిడికి చెట్లు నేల కూలాయి. గత 34 గంటల వ్యవధిలో 27 సెంమీటర్ల వర్షపాతం నమోదైంది. అవసరమైతే తప్పా బయటకు రావద్దంటూ కోరింది ప్రభుత్వం. హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని కోరింది.