ఆక్రమణల్లో డబ్బున్నోళ్లే ఎక్కువ
NEWS Dec 01,2024 01:59 am
హైదరాబాద్ నగరంలో ఎక్కువగా ఆక్రమణల్లో సంపన్నులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇప్పటికే ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై సర్వే చేపట్టామని చెప్పారు. ఆక్రమణదారుల ఆట కట్టించేందుకు త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు కమిషనర్.