లైంగిక దాడుల నివారణకు చర్యలు
NEWS Dec 01,2024 06:40 am
బాలలపై విస్తృతమవుతున్న అన్ని రకాల హింసలను, లైగిక దాడులకు నిరోధించాల్సిన గురుతర బాధ్యత పౌర సామాజంపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా పొక్సో కోర్టు జడ్జీ, అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్ లో ఆమె పొక్సో చట్టం విశిష్టతను వివరించారు. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం-2012 ను చిన్నగా పొక్సో చట్టంగా పిలవడం జరుగుతున్న దని తెలిపారు. పొక్సో చట్టం ప్రకారం ప్రత్యేక పొక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.