రైతు రుణమాఫీ వెంటనే పూర్తి చెయ్యాలి
NEWS Dec 01,2024 06:22 am
రైతు రుణమాఫీ వెంటనే పూర్తి చెయ్యాలని కోరుతూ మల్లాపూర్ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శనివారం మల్లాపూర్ రైతులు తహసీల్దార్ వీర్ సింగ్ కి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికి రుణమాఫీ పూర్తి కాకా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎలాంటి షరతులు విధించకుండా 2 లక్షల రుణమాఫీ తక్షణమే పూర్తి చెయ్యాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ సంఘ్ నాయకులు, రైతులు పాల్గొన్నారు