కేజ్రీవాల్ పై దాడికి యత్నం
NEWS Nov 30,2024 02:53 pm
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఢిల్లీలో ఓ వ్యక్తి లిక్విడ్ తో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. దాడికి యత్నించిన ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని మాళవియానగర్ లో చోటు చేసుకుంది. తన మద్దతుదారులతో ప్రజలను కలిసేందుకు వెళుతున్న కేజ్రీవాల్ పై అనూహ్యంగా దాడికి యత్నించడం కలకలం రేపుతోంది.