Logo
Download our app
అంజన్న క్షేత్రంలో భక్తుల తాకిడి
NEWS   Nov 30,2024 11:37 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శనివారం ఉదయం నుండే భక్తుల తాకిడి నెలకొంది. చలిని కూడా లెక్కచేయకుండా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కార్తీక ఆఖరి శనివారం సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి, మొక్కులు తీర్చుకుంటున్నారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు నిత్యం పర్య‌వేక్షిస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source