Logo
Download our app
అప్పుల బాధతో యువకుడు మృతి
NEWS   Nov 29,2024 05:52 pm
కోనరావుపేట మండలం నాగరం గ్రామానికి చెందిన దూస వెంకటేష్ అనే వ్యక్తి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి తండ్రి, భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 6 నెలల క్రితం గల్ఫ్ వెళ్లి అక్కడ ఉపాధి లేక ఇంటికి వచ్చిన వెంకటేష్ వేములవాడలో ఒక బట్టల షాపులో జీతం ఉంటు కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వారం క్రితం గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుటుంబాని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source