Logo
Download our app
ఏసీబీకి చిక్కిన జూనియ‌ర్ అసిస్టెంట్
NEWS   Nov 29,2024 11:54 am
నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని స‌ర్వే, భూ ద‌స్తావేజుల స‌హాయ సంచాల‌కుల కార్యాల‌యంలో జూనియ‌ర్ అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్న జి. జ‌గ‌దీశ్ ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంది. భూమికి సంబంధించిన సేత్వార్, టోంచ్ చిత్ర ప‌టం ఇచ్చేందుకు రూ. 10 వేలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో వ‌ల‌ప‌న్ని అధికారులు ప‌ట్టుకున్నారు. కేసు న‌మోదు చేశారు. ఎవ‌రైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు ఫోన్ చేయాల‌ని ఏసీబీ కోరింది.
⚠️ You are not allowed to copy content or view source