Logo
Download our app
అంగన్వాడీ భవనానికి భూమి పూజ
NEWS   Nov 29,2024 09:51 am
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో శుక్రవారం నూతన అంగన్వాడీ భవనానికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వమ‌ని, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ అంతడుపుల పుష్పలత - నర్సయ్య,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source