మహిళలకు వంటల పోటీలు
NEWS Nov 29,2024 09:49 am
నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి క్లబ్ హౌస్ లో శుక్రవారం ఎల్ పి జి డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వంటల పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మహిళలు పాల్గొని వివిధ రకాల తెలంగాణ వంటకాలను వండి స్టాల్స్ లలో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యఅతిథిగా డి.ఎస్.ఓ కిరణ్ వచ్చి మహిళల వంటకాలను పరిశీలించారు. వంటింట్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.