Logo
Download our app
భక్తుడికి చుక్కలు చూపించిన వానరం
NEWS   Nov 29,2024 03:38 am
కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన భక్తుడికి కోతి చుక్కలు చూపించింది. భక్తుడి చేతిలో ఉన్న బ్యాగ్, సెల్ ఫోన్ ను ఎత్తుకెళ్లి ఆలయ గోపురం పైన కూర్చుని, ఎంత బతిమిలాడినా ఇవ్వకుండా భక్తుడిని ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు పులిహోర ప్యాకెట్ ఇవ్వడంతో అందుకు బదులుగా బ్యాగును వదిలేసింది. కానీ సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ భక్తుడు సెల్ ఫొన్ కోసం నానా తంటాలు పడ్డాడు. చివరికి గోపురం పైన వదిలిపెట్టిన ఫోన్ ను పైకి ఎక్కి తీసుకుని వెళ్ళిపోయాడు.
⚠️ You are not allowed to copy content or view source