Logo
Download our app
వైభవంగా ధన్వంతరి వ్రతం వేడుకలు
NEWS   Nov 28,2024 04:34 pm
కార్తిక బహుళ త్రయోదశి సందర్భంగా ఆది వైద్యుడు, దేవ వైద్యుడు శ్రీ ధన్వంతరి స్వామి వారి వ్రతాన్ని ఆలమూరు మండలం చింతలూరు శ్రీ ధన్వంతరి స్వామి వారి ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ద్విభాష్యం వెంకట సూర్య సుజన్ దంపతుల చేతుల మీదుగా శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించారు. కార్తిక బహుళ త్రయోదశిని ధన్వంతరి జయంతిగా జరుపుకోవాలని ఇక్కడి ఆనవాయితీ.
⚠️ You are not allowed to copy content or view source