గుకేశ్ ఖాతాలో 3వ విజయం!
NEWS Nov 27,2024 05:52 pm
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్‌లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందాడు. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్ (18) చరిత్ర సృష్టిస్తారు.