Logo
Download our app
ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
NEWS   Nov 27,2024 01:20 pm
నారాయణపేట జిల్లా మాగనూర్‌ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై హైకోర్టు సీరియస్ ​అయ్యింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అధికారులు నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ చాలా సీరియస్‌ అంశమంది. వారంలో కౌంటర్‌ వేస్తామన్న ప్రభుత్వ లాయ‌ర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారం రోజులు ఎందుకని నిలదీసింది.
⚠️ You are not allowed to copy content or view source