Logo
Download our app
మల్యాల: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
NEWS   Nov 27,2024 01:13 pm
ప్రజా విజయోత్సవ సంబరాల్లో భాగంగా మల్యాల ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పునరుత్పాదక వనరులపై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. ఇందులో సమన్విత అనే విద్యార్థినికి మొదటి బహుమతి, సాత్వికకు రెండో బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జయసింహారావు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర చారి, రాజయ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source