Logo
Download our app
గుర్తు తెలియని వాహనం ఢీ ఇద్దరు యువకులకు గాయాలు
NEWS   Nov 27,2024 01:21 pm
మేడిపల్లి శివారులోని ప్రధాన రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన లోకేష్, రాహుల్ అనే యువకులు కోరుట్లలోని సాయిబాబా గుడికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వీరిని అంబులెన్సులో జగిత్యాల లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source