CMRF చెక్కులు అందజేత
NEWS Nov 27,2024 01:24 pm
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇద్దరు లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైంది. మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు చెక్కులను మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. మైలవరం పట్టణానికి చెందిన కలకొండ రామారావుకి రూ.80 వేలు, సబ్జపాడు గ్రామానికి చెందిన మోదుగువరపు శివకుమారికి రూ.44వేలు సి.ఎం.ఆర్.ఎఫ్ నుంచి మంజూరయ్యాయి.