Logo
Download our app
బస్సు దిగబోయి కిందపడిన మహిళా
NEWS   Nov 27,2024 08:58 am
బస్సు దిగబోయి మహిళా కిందపడి తీవ్ర గాయాలైన ఘటన లింగాల ఘనపూర్ మండలంలో జరిగింది. జీడికల్ కు చెందిన పరకాల సునీత చిన్నమాడూరుకు వెళ్ళింది. వడ్డీచర్ల గ్రామ వద్ద కొత్తపల్లి మూల మలుపులో స్టేజి దాటిపోతుందని కదిలే బస్సులో నుంచి దిగి పడిపోయింది. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source