Logo
Download our app
ఆత్మనగర్ లో భారత రాజ్యాంగ దినోత్సవం
NEWS   Nov 26,2024 08:51 am
మెట్‌ప‌ల్లి మండలం ఆత్మనగర్ గ్రామ పంచాయతీలో భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. అలాగే ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా జాతీయ ఉపాధి పథకంలో 100 రోజులు పని చేసిన కూలీని, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నిజాముద్దీన్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source