Logo
Download our app
కిటకిటలాడుతున్న కొండగట్టు
NEWS   Nov 26,2024 07:57 am
కార్తీకమాస చివరి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వేకువ జాము నుండే అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయం ముందర ఉన్న రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఆలయ అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source