జగిత్యాల ప్రజావాణికి 35 ఫిర్యాదులు
NEWS Nov 25,2024 03:31 pm
ప్రజావాణికి 35 ఫిర్యాదులు వచ్చినట్లు జగిత్యాల కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని వారి సమస్యను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు.