Logo
Download our app
మల్యాలకు హిందూ జాగరణ రథయాత్ర
NEWS   Nov 25,2024 06:06 pm
ధర్మ జాగరణ జగిత్యాల జిల్లా అధ్వర్యంలో చేపట్టిన హిందూ జాగరణ రథయాత్ర సోమవారం మల్యాల మండలంలోని తక్కళ్లపల్లి, లంబాడిపల్లి, తాటిపల్లి, సర్వపూర్, బల్వంతాపూర్ గ్రామాల మీదుగా మల్యాలలోకి ప్రవేశించింది. మల్యాల పొలిమేర నుండే ప్రజలు కోలాటాల మధ్య శివపార్వతులు ఉన్న రథాన్ని ఆహ్వానించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు పట్టారు. ఈ రథయాత్ర ముత్యంపేట మీదుగా జగిత్యాలకు చేరుకుంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మల్యాల మండల శాఖ వారు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source