Logo
Download our app
గుజరాత్‌కు సిరాజ్‌.. సన్‌రైజర్స్‌కు షమీ
NEWS   Nov 24,2024 03:11 pm
దుబాయి వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం కొనసాగుతున్నది. టీమిండియా స్టార్‌ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడి మరి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన స్టార్‌ బౌలర్‌ హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ సైతం వేలంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వేలంలోకి వచ్చిన సిరాజ్‌ను కొనుగోలు చేసేందుకు పలు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్‌ మధ్య పోటీ గట్టిగానే సాగింది. గత కొంతకాలంగా సిరాజ్‌ టీమిండియా తరఫున అన్ని టెస్టులు, వన్డేలు, టీ20ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. దాంతో ఈ బౌలర్‌ను కొనుగోలు చేసేందుకు ఆయా జట్లు పోటీపడ్డాయి. రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన సిరాజ్‌ ధర భారీగా పెరిగింది.
⚠️ You are not allowed to copy content or view source