IPL చరిత్రలో అత్యధిక ధర!
NEWS Nov 24,2024 12:34 pm
టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ వేలంలో అదరగొట్టారు. బేస్ ప్రైస్ రూ.2 కోట్లు ఉండగా రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇతడి కోసం ఢిల్లీ, పంజాబ్ తీవ్రంగా పోటీ పడ్డాయి. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. అయ్యర్ 2024 సీజన్లో KKRను విజేతగా నిలిపారు. కాగా, ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ గతేడాది రూ.24.75 కోట్లు పలికారు.