Logo
Download our app
అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలి
NEWS   Nov 24,2024 06:57 am
ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ వారోత్సవాల ముగించు కార్యక్రమం సంద‌ర్భంగా పెద్ద‌ప‌ల్లిలో ర్యాలీ జ‌రిగింది. డాక్టర్ ప్రసన్న కుమారి మాట్లాడుతూ.. సరైన డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకుని సరియైన ఆంటీ బయాటిక్స్ మందులు సరైన డోసులో పూర్తి కాలం వాడాలన్నారు. సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మలవిసర్జన తర్వాత వంటకు ముందు, ఆహారం భుజించుటకు ముందు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రజలు అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source