వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై
NEWS Nov 23,2024 12:16 pm
వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఏరి కోరి తెచ్చుకొని ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన జయమంగళం వెంకటరమణ పార్టీతో పాటు మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖ మండలి చైర్మన్ మోషెన్‌రాజుకు పంపారు. వెంకటరమణ జనసేన వైపు చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.