Logo
Download our app
అంగన్వాడి కేంద్రాలు చిన్నారులను ఆకర్షించాలి
NEWS   Nov 23,2024 06:07 pm
అంగన్వాడీల్లోని చిన్నారులందరికీ నాణ్యమైన పౌష్టికాహారం అందివ్వాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని నాయిడివాడలోని అంగన్వాడీ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి ఆమె తనిఖీ చేశారు. అంగన్వాడీలలో చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని తెలిపారు. అంగన్వాడీల్లో తరగతి గదులు చిన్నారులను ఆకర్షించే విధంగా ఉండాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source