సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి
NEWS Nov 23,2024 06:08 pm
సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని చైర్పర్సన్ గండి పద్మ అన్నారు. ఆమె అధ్యక్షతన శనివారం ఆలమూరు లోని స్థానిక సమత మహిళ పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం లిమిటెడ్ ఆలమూరు నందు సీఈవో దాసు ఆధ్వర్యంలో సహకార వ్యవస్థ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో సహకార వ్యవస్థ బలోపేతమైందన్నారు.