సత్య సాయిబాబా జయంతి వేడుకలు
NEWS Nov 23,2024 10:41 am
నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా 99 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులకు సత్య సాయి బాబా మహిమలను వివరించి అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.