100% పన్నుల వసూలు చేయాలి
NEWS Nov 22,2024 02:22 pm
పట్టణ ప్రాంతాలలో వంద శాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ పరిధిలోని పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రకాల పన్నుల వసూలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయానికి పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. .