Logo
Download our app
గర్భస్థ మరణాలపై క‌లెక్ట‌ర్‌ సమావేశం
NEWS   Nov 22,2024 05:08 pm
గర్భస్థ మహిళల మరణాలను నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో గర్భస్థ మరణాలపై వైద్యశాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. హై రిస్క్ గర్భస్థ మహిళలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హెల్ప్ లైన్ కేంద్రాల ద్వారా వారికి అవసరమగు వైద్య సేవల వివరాలను తెలియజేయనున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source