ఇంటింటికీ జియో ట్యాగింగ్ మ్యాపింగ్
NEWS Nov 22,2024 12:12 pm
జియో ట్యాగింగ్ మ్యాపింగ్ కు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో సునీత శర్మ కోరారు. కేతనకొండ గ్రామంలో ఇంటింటికీ జరుగుతున్న జియో ట్యాగింగ్ సర్వేను శుక్రవారం ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జియో ట్యాగింగ్ చేసిన ఇళ్లకు జియో కో - ఆర్డినేట్స్ క్యాప్చర్ చేయనున్నట్లు చెప్పారు. జియో ట్యాగింగ్ పూర్తయితేనే ఏ పథకమైనా ఇంటి పరిధిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. మ్యాపింగ్ చేస్తున్న సిబ్బందికి సచివాలయంలో సూచనలు చేశారు. మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.