బాలికల వసతి గృహం తనిఖీ
NEWS Nov 22,2024 11:52 am
మెట్‌పల్లి: కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ మోహన్ మెట్‌పల్లి పట్టణంలోని షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంట సామాను గదిని, కిచెన్ గదిని, టాయిలెట్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట పలువురు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.